Monday, February 19, 2007

విలువల బాట రతన్ టాటా

ఇక మిగిలింది టాటా స్టీల్. అప్పటికే అది నష్టాల్లో వుంది. అయినా దాన్ని అమ్మడం రతన్‌కు ఇష్టం లేదు. అది టాటాలకు ప్రాణం. దేశానికి గర్వకారణం! ఎలాగైనా లాభాల బాట పట్టించాలనుకున్నారు. "మనం గట్టెక్కాలంటే ఎనిమిది శాతం ఖర్చు తగ్గించాలి"... డిన్నర్ మీటింగ్‌లో అధికారులతో చెప్పారు. అదంత సులభం కాదని వారికి తెలుసు. అదే మాట అన్నారు. అయినా రతన్ వినలేదు. ఉత్పత్తిలో ప్రతి దశనూ దగ్గరుండి గమనించారు. లోపాలు ఎక్కడున్నాయో అర్థమైంది. ప్రధాన సమస్య... అవసరానికి మించినంత ఉద్యోగులు! సగానికి పైగా కుదించాలి. ఒక్క కలం పోటుతో ఇంటికి పంపొచ్చు! కానీ ఆయనలో ప్రవహిస్తున్న టాటా రక్తం అందుకు ఒప్పుకోలేదు. మధ్యేమార్గంగా స్వచ్ఛంద పదవీవిరమణ పథకాన్ని ప్రకటించారు. రాజీనామా చేస్తేచాలు. రిటైర్ అయ్యేదాకా జీతం అందుతుంది. ఇది సంస్థకు తాత్కాలిత భారమే అయినా దీర్ఘకాలంలో లాభదాయకం. "ఆ నిర్ణయం తీసుకున్నాక ప్రశాంతంగా నిద్రపట్టింది. లేదంటే... కలలో కూడా కార్మికుల ఆకలి చూపులే కనిపించేవి" అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు రతన్.

పైన ఉదహరింపబడిన భాగము "విలువల బాట రతన్ టాటా" అన్న ఈనాడు వ్యాసమునుండి సంగ్రహింపబడినది. పూర్తి వ్యాసము కొరకు ఈ లంకెను చూడండి.

ఇక్కడ నా సందేహము ఏమంటే, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లిస్తే ఖర్చు 8% ఎలా తగ్గుతుంది? దయచేసి వివరింపగలరు.

ముందుమాట

నాలో ఎన్నో సందేహాలు (ఆవకాయ నుండి అంతరిక్షం వరకు). వాటిని తీర్చుకునేందుకు నేను ఈ బ్లాగుని మొదలు పెడుతున్నాను. దయచేసి అనుభవజ్ఞులు నా సందేహాలను తీర్చగలరని మనవి.